17800పైన నిఫ్టి
నిఫ్టి ఆశాజనకంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17811 పాయింట్లున తాకిన నిఫ్టి లాభాల స్వీకరణ కారణంగా వెంటనే 17430ని తాకింది. ఇపుడు 17432 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 11 పాయింట్లు లాభంతో ఉంది. ఆరంభంలో నిఫ్టికి బ్యాంక్ నిఫ్టి అండగా ఉంది. ఆ కౌంటర్లలో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది. దీంతో ప్రధాన సూచీలన్నీ రెడ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు అర శాతం వరకు లాభంతో నష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ఇవాళ కూడా నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. అయితే నిఫ్టిలో 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా లాభాల్లో ఉన్న షేర్లు స్వల్పంగా లాభపడగా, నష్టాల్లో ఉన్న షేర్లు రెండు నుంచి ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. లారస్ ల్యాబ్ ఇవాళ కూడా 1.62 శాతం నష్టంతో రూ. 472 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి తొలి మద్దతు స్థాయి 17690. రేపు మార్కెట్లకు సెలవు. ఎల్లుండి మార్కెట్‌కు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌కు క్లోజింగ్. దీంతోచాలా మంది ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను ఇవాళే క్లోజ్ చేస్తారు.