17,800పైన నిఫ్టి…నిలబడేనా?
నిన్నటి నష్టాలన్నీ ఇవాళ ఓపెనింగ్‌లోనే రికవరయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,814ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 146 పాయింట్ల లాభంతో 17,792 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జ్యువలరీ, రియల్ ఎస్టేట్ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఒకే రంగానికి కాకుండా.. అన్ని రంగాల షేర్లలో ర్యాలీ కన్పిస్తోంది. నిఫ్టి 0.8 శాతం లాభానికి పరిమితం కాగా, నిఫ్టి మిడ్ క్యాప్ ఏకంగా 1.22 శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా నిఫ్టి స్థాయిలోనే ఉంది. ఎస్బీఐ కొత్త రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతోంది. నిఫ్టిని 17,820 స్టాప్‌లాస్‌తో షార్ట్ చేసి స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. మిడ్ సెషన్‌లోపలే ఈ అవకాశం వస్తుందేమో చూడండి. భారీ లాభాల కోసం ఎదురు చూడొద్దు. 17820 దాటితే నిఫ్టి కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది.