17750పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి కన్నా అధిక లాభంతో నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17768ని తాకిన నిఫ్టి ఇపుడు 17745 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 121 పాయింట్ల లాభంతో ఉంది. అన్ని ప్రధాన సూచీలు అర శాతం కంటే అధిక లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్ 0.76 శాతం లాభపడింది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు బాగా తగ్గడంతో పెయింట్, టైర్ కంపెనీల షేర్లు బాగా లాభపడ్డాయి. నిఫ్టి టాప్ గెయినర్‌గా ఏషియన్ పెయింట్ కొనసాగుతోంది. బ్యాంక్ షేర్లలో చాలా మంది బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్‌ను రెకమెండ్ చేస్తున్నారు. బ్లాక్ డీల్ కారణంగా ఇండిగో షేర్ 3 శాతంపైగా నష్టంతో ఉంది. ఆస్ట్రాల్ ప్రతిరోజూ పెరుగుతోంది. ఇవాళ కూడా ఈ షేర్ రెండు శాతం పెరగడం విశేషం. ఇవాళ వీక్లీ డెరివేటివ్ క్లోజింగ్ కావడంతో పలు షేర్లలో హెచ్చతగ్గులు ఉండొచ్చు.