For Money

Business News

భారీ లాభాలతో నిఫ్టి ప్రారంభం

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. 17,615 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి ఇపుడు 17633 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 101 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు అర శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ సూచీ కూడా 0.8 శాతం లాభంతో ఉంది. ఫార్మాకు కూడా మద్దతు లభిస్తోంది. నిఫ్టి దాదాపు తొలి నిరోధక స్థాయి వద్ద ప్రారంభమైంది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17,630 వద్ద ఎదురు కావొచ్చు. ఈ స్థాయి లోపల స్ట్రిస్ట్‌ స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చని మార్కెట్‌ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. అయితే ఈ స్థాయి దాటితే నిఫ్టిని అమ్మొద్దని సలహా ఇస్తున్నారు. నిఫ్టిపై ఒత్తిడి విస్తే 15,735 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. మార్కెట్‌కు ఈ స్థాయి చాలా కీలకం.