For Money

Business News

17600పైన నిఫ్టి

అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల నుంచి గ్రీన్‌లోకి రావడంతో… ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సింగపూర్ నిఫ్టి కూడా 70 పాయింట్ల లాభంలోకి వచ్చింది. దీంతో నిఫ్టి ఓపెనింగ్‌లోనే ఆకర్షణీయ లాభాలతో 17634 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా క్షీణించి ఇపుడు 17614 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌ పడినపుడల్లా గట్టి మద్దతు లభిస్తోంది. నిన్న ఉదయం కనిష్ఠ స్థాయిలో కొనుగోలు చేసినవారికి ఇవాళ భారీ లాభాలు దక్కాయి. నిఫ్టి 51 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టితొలి ప్రతిగటన 17626 కాగా, రెండో స్థాయి 17644. 17771 దాటితే బ్రేకౌట్‌కు ఛాన్స్‌ ఉంటుంది. ఈ వారం కేవలం రెండే ట్రేడింగ్‌ రోజులు ఉన్నందున… ఇన్వెస్టర్లు పొజిషన్స్‌ తీసుకోవడంలో జాగ్రత్త వహించడం మంచిది. నిఫ్టితో పాటు అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉన్నాయి. చక్కటి ఫలితాలు ప్రకటించిన ఐటీసీలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ మాత్రం 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. టైటాన్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది.