17450పైన నిఫ్టి ప్రారంభం
సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17467ని తాకింది. ఇపుడు 17459 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 146 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి దాదాపు 15 రోజుల చలన సగటు వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలోని మొత్తం 50 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎప్పటిలాగే నిఫ్టి బ్యాంక్ ఇవాళ కూడా ఒక శాతం లాభంతో నిఫ్టికి అండగా నిలిచింది. ఇక నిఫ్టి మిడ్ క్యాప్ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. అన్ని లాభాల్లో ఉన్నా… అన్నీ పరిమితం లాభంలోనే ఉన్నాయి. నిఫ్టి టాప్ గెయినర్ విప్రో రెండు శాతం లాభంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌లో గ్లాండ్ ఫార్మా, జొమాటొ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్యాంక్ షేర్లలో 1.32 శాతంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇవాళ రెండు భారీ బ్లాక్ డీల్స్ జరిగాయి. జీలో ఇన్వెస్కో దాదాపు 5.25 శాతం వాటా విక్రయించింది. ఈ షేర్ ఓపెనింగ్‌లోనే ఆరు శాతం పెరిగింది. ఇక సంవర్ధన మదర్సన్ కంపెనీలో జపాన్ కంపెనీ వాటా విక్రయించింది. ఈ షేర్ అయిదు శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న లిస్టయిన ఎలక్ట్రానిక్స్ మార్ట్ షేర్ ఇవాళ మూడు శాతం లాభంతో రూ. 87.45 వద్ద ట్రేడవుతోంది.