17400పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి లాభాలకన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17428ని తాకింది. ప్రస్తుతం 17383 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టికి ఐటీ షేర్ల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు షేర్లు మాత్రం అర శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే అసలు యాక్షన్ మిడ్ క్యాప్ షేర్లలో ఉంది. ఈ సూచీ 1.55 శాతం లాభంతో ఉంది. నిఫ్టి విషయానికొస్తే హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో వేదాంత, డీఎల్ఎఫ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఏకంగా ఆరు శాతం క్షీణించడం గమనార్హం. ఇక మిడ్ క్యాప్ షేర్ల విషయానికొస్తే భారత్ పోర్జ్ 5.55 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ 5 శాతంపైగా లాభపడ్డాయి. పర్సిస్టెంట్స్ సిస్టమ్ షేర్‌పై మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన రిపోర్ట్‌తో షేర్ 4 శాతంపైగా లాభపడింది. ఏయూ బ్యాంక్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఈ షేర్ ఇవాళ 5 శాతం దాకా పెరిగింది. ఈ బ్యాంక్ షేర్ తప్ప మిగిలిన షేర్లలో పెద్ద మార్పు లేదు.