For Money

Business News

మార్కెట్‌ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో  ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17450ని తాకింది. ఇపుడు 90 పాయింట్ల లాభంతో 17442 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 0.8 శాతం లాభంతో ఉంది. ఇక నిఫ్టి నెక్ట్స్‌ సూచీ కూడా చక్కటి లాభాలు ఆర్జించింది. ఇక నిఫ్టి షేర్ల విషయానికొస్తే.. ఏకంగా 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే లాభాలు ఒక శాతం లోపే ఉన్నాయి. అలాగే నష్టాల్లో ఉన్న షేర్లు కూడా అలాగే ట్రేడవుతున్నాయి. మిడ్‌ క్యాప్‌ ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌ షేర్ 6.6 శాతం లాభంతో ట్రేడవుతోంది.