For Money

Business News

17300పైన నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17300 స్థాయిని దాటింది. ఇపుడు క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 67 పాయింట్ల లాభంతో 17289 వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న భారీగా పెరిగిన బ్యాంక్‌ నిఫ్టి ఇవాళ స్వల్ప లాభాలకు పరిమితమైంది. నిన్న నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్‌ క్యాప్‌ ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ఉంది. కేవలం జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ షేర్‌ ఒక్కటే నష్టాల్లో ఉంది. మిగిలిన 24 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ కూడా అర శాతం లాభంతో ఉంది. అదానీ విల్మర్‌ షేర్‌ ఇవాళ కూడా 7 శాతం వరకు పెరగడం విశేషం. రుచి సోయా షేర్‌ రూ. 801 వద్ద 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది.