MARKET OPEN: 17,200పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికన్నా ఇంకాస్త అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,210 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17,191 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 99 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్నిఫ్టి అరశాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ నిఫ్టి ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన రియల్ ఎస్టేట్ షేర్లకు మద్దతు లభిస్తోంది. అలాగే న్యూఏజ్ షేర్లలో కొన్ని కోలుకున్నాయి. నిఫ్టిలో మూడు షేర్లు నష్టాల్లో ఉండగా, మిగిలిన షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి.