16,800పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 16863ని తాకిన నిఫ్టి ఇపుడు 16832 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 155 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 45 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయిదు షేర్లు నష్టాల్లో ఉన్నా.. అవి నామమాత్రమే. అమెరికా ఏడీఆర్ బాటలో ఇన్ఫోసిస్ షేర్ ఇవాళ మూడు శాతం దాకా పెరిగింది. మెటల్స్ కూడా పరవాలేదు. అన్ని ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రీన్ టాప్ గెయినర్‌గా నిలిచింది. వరుస భారీ నష్టాల తరవాత డిక్షన్ టెక్నాలజీస్ ఇవాళ లాభాల్లో ఉంది.