నిఫ్టికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కిక్
డిజిటల్ బిజినెస్ చేయకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో క్రెడిట్ కార్డు బిజినెస్‌తో పాటు ఇతర డిజిటల్ వ్యాపారాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చేపట్టవచ్చు. దీంతో ఈ షేర్ ఓపెనింగ్‌లోనే మూడు శాతం దాకా లాభంతో ప్రారంభమైంది. దీంతో బ్యాంక్ నిఫ్టి అరశాతం వరకు పెరిగింది. ఫలితంగా నిఫ్టి ఓపెనింగ్‌లోనే రెండు ప్రతిఘటన స్థాయిలో ఓపెనైంది. 16,700 స్టాప్‌లాస్‌తో అమ్మినవారికి వెంటనే లాభాలు వచ్చాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,691ని తాకి… క్షణాల్లో 16,661 స్థాయిని తాకింది. ప్రస్తుతం 62 పాయింట్ల లాభంతో 16,676 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ మాత్రం డల్‌గా ఉంది. హెచ్డీఎఫ్ఈ బ్యాంక్ కౌంటర్లో లాభాల స్వీకరణ వస్తే నిఫ్టి క్రితం ముగింపును తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,550.60 2.37
ఐషర్ మోటార్స్ 2,556.00 1.60
అల్ట్రాటెక్ సిమెంట్ 7,510.00 1.36
శ్రీ సిమెంట్ 26,490.00 1.11
గ్రాసిం ఇండస్ట్రీస్ 1,495.35 0.97
నిఫ్టి టాప్ లూజర్స్
విప్రో 630.95 -0.62
JSW స్టీల్ 740.05 -0.56
ఇన్ఫోసిస్ 1,732.10 -0.55
టాటా మోటార్స్ 296.10 -0.54
ఐసీఐసీఐ బ్యాంక్ 698.25 -0.42