నిఫ్టి.. లాభాల్లో ప్రారంభమైనా…
అధిక స్థాయిలను సునాయాసంగా అధిగమిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న నిఫ్టి ఇవాళ 17,200 ప్రాంతానికి వెళ్ళింది. ఓపెనింగ్‌లోనే 17,185ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17,159 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 27 పాయింట్లు లాభపడింది. నిఫ్టి తొలి ప్రధాన ప్రతిఘటన స్థాయి 18,195. ఈ స్థాయి దాటితే 17,260. నిన్న ఓపెనింగ్‌లో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి… తరవాత రోజంతా పెరుగుతూనే వచ్చింది. ఇవాళ మళ్ళీ సీన్ రిపీట్ అవుతుందా లేదా ఒత్తిడి లోనౌతుందా అనేది చూడాలి. నిఫ్టి ఓవర్‌బాట్ పొజిషన్‌లో ఉండటమే ఈ అనుమానాలకు కారణం. ఆటోమొబైల్ డేటా మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉండటంతో…. నిఫ్టి ఎలా స్పందిస్తుందో చూడాలి.
నిఫ్టి టాప్ గెయినర్స్
యాక్సిస్ బ్యాంక్ 806.40 2.53
బజాజ్ ఆటో 3,789.55 1.66
నెస్లే ఇండియా 19,730.50 1.35
ఎల్ అండ్ టీ 1,693.65 1.28
ఏషియన్ పెయింట్స్ 3,240.10 1.21
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌డీఎఫ్‌సీ 2,761.80 -1.31
భారతీ ఎయిర్‌టెల్ 659.40 -0.70
కొటక్ మహీంద్రా 1,744.45 -0.53
టాటా స్టీల్ 1,443.15 -0.49
మారుతీ 6,819.00 -0.40