ఈ లాభాలు నిలిచేనా?

ట్రంప్ సుంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నాయి సూచీలు. మార్కెట్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతోందో…అదే ఫాస్ట్‌గా పడుతోంది. నిన్న సెలవు కారణంగా మన మార్కెట్‌లో ఓ భారీ జంప్‌ను మిస్సయ్యారు. రాత్రి అమెరికా మార్కెట్లు క్షీణించడంతో ఇవాళ పరిమిత లాభంతో నిఫ్టి ఓపెనైంది. ప్రస్తుతం 385 పాయింట్ల లాభంలో 22784 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు ఒక శాతం నుంచి రెండు శాతం వరకు లాభాలతో ఉన్నాయి. ఇవాళ 2370 షేర్లు ట్రేడవుతుండగా, ఇందులో ఏకంగా 2176 షేర్లు గ్రీన్‌లో ఉండటం విశేషం. కేవలం 151 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్లలో సిప్లా టాప్ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానంలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు ఉన్నాయి. నిఫ్టి షేర్లలో కేవలం రెండు షేర్లు ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.