For Money

Business News

17,500పైన నిఫ్టి

ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,554 వద్ద ప్రారంభమైంది. క్షణాల్లోనే 17506ని తాకినా.. ఇపుడు 17530 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 66 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి దాదాపు 39 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఆర్బీఐ పరపతి విధానం మరో అర గంటలో ఉన్నందున బ్యాంక్‌ నిఫ్టి స్వల్ప లాభానికి పరిమితమైంది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా పెద్ద మార్పు లేదు. అంటే కేవలం సూచీలు పెంచేందుకు మాత్రమే ఈ ట్రేడింగ్‌ సాగుతోంది. నిఫ్టి మినహా దాదాపు అన్ని సూచీలు నామ మాత్రపు లాభాలతో ఉన్నాయి. మరి ఆర్బీఐ పరపతి విధానం వెల్లడి తరవాత మార్కెట్‌కు మద్దతు అందుతుందా లేదా అమ్మకాల ఒత్తిడి వస్తుందా అన్నది చూడాలి. ఇవాళ స్టీల్‌,ఐటీ షేర్లకు మంచి మద్దతు లభిస్తోంది. ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో అరబిందో ఫార్మా షేర్లు నష్టాలతో ప్రారంభమైనా.. వెంటనే లాభాల్లోకి వచ్చేసింది.