NIFTY TRADE: 17225 వద్ద మద్దతు
నిఫ్టి 17531 వైపు సాగుతోందని ప్రముఖ డేటా అనలిస్ట్ వీరందర్ అంటున్నారు. నిఫ్టి ఓపెనింగ్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైనా… పడుతుందేమో చూడాలి. దిగువన 17225 లేదా 17162 ప్రాంతంలో గట్టి మద్దతు లభించే అవకాశముంది. 17200 వద్ద పుట్ రైటింగ్ జోరుగా ఉంది. అంటే మార్కెట్ ఈ స్థాయిలో మద్దతు లభిస్తోంది. కాబట్టి మార్కెట్ పెరిగేందుకే ఆస్కారం ఉందని అంటున్నారు వీరేందర్. విదేశీ ఇన్వెస్టర్లు చాలా నెలల తరవాత నికర కొనుగోలుదారులుగా ఉండటం మరో ప్లస్ పాయింట్. నిఫ్టి మరీ బలహీనపడితే 17145 లేదా 17050కి చేరొచ్చు. మార్కెట్ పెరిగితే 17366 లేదా 17410కి చేరనుంది. నిఫ్టి గనుక 17513ని దాటితే 17641 దాకా వెళుతుందని వీరేందర్ అంచనా వేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌కు దిగువ వీడియోలు చూడండి.
https://www.youtube.com/watch?v=4oG8dMkS_S4
https://www.youtube.com/watch?v=SMdg4ZSLydQ