NIFTY TRADE: టీసీఎస్ ఎఫెక్ట్?
ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నా… సింగపూర్ నిఫ్టి నిస్తేజంగా ఉంది. టీసీఎస్ ఫలితాలు, పెట్రోల్, డీజిల ధరల పెంపు ఇవాళ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. రవాణాకు ఎంతో కీలకమైన డీజిల్ రేట్లు కూడా లీటరుకు రూ.101 దాటడంతో మార్కెట్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. టీసీఎస్ ఫలితాలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా లేవని బిజినెస్ ఛానల్స్ అంటున్నాయి. కాని ఫలితాలు బాగానే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత స్థాయి నుంచి టీసీఎస్‌ను మరింత ముందుకు తీసుకెళ్ళేంత బలంగా ఫలితాలు లేవనేది వాస్తవం. నిఫ్టి క్రితం ముగింపు 17,895. నిఫ్టి మూవ్మెంట్ చాలా కీలకం. ఇవాళ్టికి 17,875 స్థాయి కీలకం. నిఫ్టి గనుకు పడితేఏ 17,835 ప్రాంతంలో మద్దతు అందే అవకాశముంది. దిగువ స్థాయిలో 17800, 17,790, 17725 స్థాయిలను గమనించండి. ఒకవేళ నిఫ్టికి మద్దతు అందే పక్షంలో తొలి ప్రతిఘటన 17950 ప్రాంతంలో రానుంది. ఆపైన 17,970,18,000 ప్రాంతాల్లో ఒత్తిడి ఎదురు కావొచ్చు. ఒకవేళ నిఫ్టి గనుక పై స్థాయిలో బలహీనంగా కన్పిస్తే 17,950 ప్రాంతంలో స్ట్రిక్ట్ స్టాప్‌తో అమ్మండి. అందరూ పండుగ మూడ్‌లో ఉంటారు. పైగా శుక్రవారం సెలవు. గురువారం వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. పై స్థాయిలో నిఫ్టిని అమ్మడం వినా… ఎక్కడా కొనే ప్రయత్నం చేయొద్దు.