ఆగస్టు కల్లా నిఫ్టి 14,000కి చేరుతుంది
ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగిసిన తరవాత నిఫ్టి మరింత పెరిగే అవకాశముందని ashthechaos.comకు చెందిన చీఫ్ మార్కెట్ టెక్నీషియన్ జై బాలా అన్నారు. ఎకనామిక్ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ నిఫ్టి ఈ రిలీఫ్ ర్యాలీలో 16800ను దాటే అవకాశముందని అన్నారు. 2020 మధ్యలో ప్రారంభమైన బుల్ మార్కెట్లో ఇది రిలీఫ్ ర్యాలీ అని ఆయన అన్నారు. ఈ రిలీఫ్ ర్యాలీలో ఫార్మా, ఐటీతో పాటు కొన్ని ఎఫ్ఎంసీజీ షేర్లు పెరిగే అవకాశముందని అన్నారు. అయితే తరవాత మార్కెట్లో కరెక్షన్ వస్తుందని అన్నారు. నిఫ్టి జులై లేదా ఆగస్టు కల్లా 14000కల్లా చేరే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టి 37,000ని చేరిన తరవాత 27,000లకు చేరే ఛాన్స్ ఉందని అన్నారు.