For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి…

మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. భారత్‌తో పాటు అమెరికా వడ్డీ రేట్ల ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై పడుతోంది. అనేక దేశాలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో కరోనా తరవాత ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా మారుతున్నాయి. కరోనా సమయంలో ఏం జరుగుతుందో తెలియక భయంతో అమ్మకాలు జరిగాయి. రెండోసారి కరోనా తాకినపుడు కూడా అమ్మకాలు ఒత్తిడి వచ్చినా… భారీగా మాత్రం లేదు. కాని ఈసారి అన్ని అంశాలు పరిశీలించి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఈసారి పడితే కరోనా సమయం మాదిరి వెంటనే మార్కెట్‌ కోలుకోవడం కష్టం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు ట్రేడ్‌ చేయండి. ఇక ఇవాళ డే ట్రేడింగ్‌కు పెద్దగా ఛాన్స్‌ ఉండకపోవచ్చు. నిఫ్టి భారీ నష్టాలతో ఓపెన్‌ కానుంది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సూచీలను కాస్త నిలబెట్టే ప్రయత్నం చేసినా.. నాన్‌ నిఫ్టి షేర్లలో ఒత్తిడి వస్తుంది. ఇవాళ ఎల్‌ఐసీ రీటైల్‌ పోర్షన్‌ కూడా సబ్‌స్క్రయిబ్‌ అయితే ప్రభుత్వం కూడా మార్కెట్‌ను పట్టించుకోవడం మానేయొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16,682 ఓపెనింగ్‌లో నిఫ్టి 16450ని తాకినా ఆశ్చర్య పోనక్కర్లేదు. నిఫ్టి కోలుకుంటే 16505, 16554, 16586 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల నిఫ్టి పెరిగినపుడు అమ్మొచ్చు. డే ట్రేడర్స్‌ మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. పొజిషనల్‌ ట్రేడర్స్‌ కూడా నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు ఆగడం మంచిది. టెక్నికల్‌గా అన్ని సంకేతాలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి.