For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు అధిక స్థాయిల వద్ద అలసిపోతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్‌డాక్‌ ఒక శాతం వరకు లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ అర శాతం దాకా లాభంతో ముగిసింది. అయితే డౌజోన్స్‌ నష్టంలో ముగిసింది. అంతకుమునుపు యూరో మార్కెట్లు కూడా మిశ్రమంగా ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా డేటా ఇవాళ చాలా నిరాశాజనకంగా ఉంది. చైనా మార్కెట్లు ఒక శాతం నష్టంతో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్‌ సూచీ ఒకటిన్నర శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.