నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లకు వృద్ధి భయాలు పట్టుకున్నాయి. కరోనా భయం కూడా కొన్ని దేశాలను వెంటాడుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఇజ్రాయిల్‌ను కరోనా భయపెడుతోంది. మరోవైపు చైనా ఆంక్షలు పలు కంపెనీలను పునరాలోచనలో పడేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈబీసీ సమావేశం కానుంది. నిన్న యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. అమెరికా మార్కెట్లలోనూ ఇదే స్థాయిలో భయాలు ఉన్నా.. నష్టాలు కాస్త తక్కువ. కాని ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో అదే స్థాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లు స్వల్ప నష్టాలకు పరిమితం కాగా… జపాన్ నిక్కీ 0.6 శాతం నష్టంతో ఉంది. అన్నికంటే ముఖ్యమైంది హాంగ్‌కాంగ్ మార్కెట్. హాంగ్‌సెంగ్ ప్రస్తుతం 1.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ స్థాయి అమ్మకాల్లోనూ సింగపూర్ నిఫ్టి కేవలం 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇదే లెక్కన నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది.