స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. అన్ని సూచీలు తమ నష్టాలను చాలా వరకు తగ్గించుకున్నాయి. డౌజోన్స్, నాస్డాక్ సూచీలు నామ మాత్రపు నష్టాలతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ నామ మాత్రపు లాభంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో పాటు హాంగ్‌కాంగ్ గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలన్నీ అరశాతం లోపే ఉన్నాయి. జపాన్ నిక్కీ మాత్రం 0.3 శాతం నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టం నుంచి 50 పాయింట్ల లాభంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌కు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు. ఉక్రెయిన్ వార్తలపై ఓ కన్నేసి ఉంచండి.