స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిసినా… ఆసియా మార్కెట్లలో ఎలాంటి ఉత్సాహం లేదు. ఇవాళ అమెరికా జాబ్ డేటా రానుంది. దీంతో మార్కెట్లన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా రెడ్లో ఉంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే ఒక్క షెంజెన్ మార్కెట్ ఒక్కటే 0.8 శాతం నష్టంతో ఉంది. మిగిలిన చైనా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఉన్నాయి. హాంగ్కాంగ్ అరశాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ కాస్త అటూ ఇటూగా ట్రేడవుతున్నాయి. జపాన్ మార్కెట్లో కూడా ఉత్సాహం లేదు. సింగపూర్ నిఫ్టి కూడా నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.