For Money

Business News

NIFTY TODAY: పడే వరకు ఆగండి

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. అమెరికా మార్కెట్ల ట్రెండ్‌ చూస్తుంటే… నిఫ్టి అధిక స్థాయిలో నిలబడటం కష్టంగా కన్పిస్తోంది. ఫెడ్‌ నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిక స్థాయిలో అమ్మి.. దిగువ స్థాయిలో బయటపడటం మంచిదని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే నిఫ్టికి భారీ నష్టాలు మాత్రం అనుమానమేనని, ఫెడ్‌ నిర్ణయం తరవాత అలాంటి పరిస్థితి వస్తుందేమో చూడాలని అంటున్నారు. ముఖ్యంగా టోకు ధరలు, వినియోగ ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో టెన్షన్‌ ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించండి. నిఫ్టి క్రితం ముగింపు 17,324. ఇక్కడి నుంచి పెరిగితే 17,370 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. ఈ స్థాయి దాటితే 17400కు చేరొచ్చు. కాని ఇవాళ ఈ పరిస్థితి రావడం కష్టమే. తొలి ప్రతిఘటన స్థాయి ప్రాంతంలోనే నిఫ్టిని స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. స్టాప్‌లాస్‌ 17,380గా పెట్టుకోవచ్చు. ఇక పడితే 17310 స్థాయికి వెంటనే చేరొచ్చు. కొనుగోళ్ళ మద్దతు మాత్రం 17260-17270 పాయింట్ల మధ్య అందే అవకాశముంది. ఈ స్థాయికి వచ్చినపుడు నిఫ్టి బలం చూడండి. బలహీనంగా ఉంటే 17250 లేదా 17225కి రావొచ్చు. మిడ్‌ సెషన్‌ యూరో మార్కెట్లు బలహీనంగా ఉంటే ఈ స్థాయికి నిఫ్టి చేరొచ్చు. కాని దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు ఉంటుందని… భారీగా క్షీణించే అవకాశాలు తక్కువేనని అంటున్నారు టెక్నికల్‌ అనలిస్టులు.