NIFTY TRADE: 17700 వద్ద సపోర్ట్
మార్కెట్‌లో ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటం, మార్కెట్ ఇప్పటికే నాలుగు రోజుల నుంచి పెరుతూ వస్తుండటంతో… ఇవాళ నిఫ్టి నిలకడగా ఉండొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గించారు కాని.. కొనుగోళ్ళు చేయడం లేదు. కాల్ రైటింగ్ అత్యధికంగా 18000 స్థాయిల వద్ద అలాగే పుట్ రైటింగ్ 17700 వద్ద అధికంగా ఉందని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి నిఫ్టి 17700 ప్రాంతంలో గట్టి మద్దతు లభించే అవకాశముందని అంటున్నారు. ఈయన అంచనా ప్రకారం దిగువ స్థాయిలో నిఫ్టి 17744 లేదా 17705 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఈ స్థాయి దిగువకు వస్తే 17664ని తాకే అవకాశముంది. ఒకవేళ పెరిగితే 17836 వద్ద తొలి ప్రతిఘటన, 17873 వద్ద రెండో ప్రతిఘటన ఎదురు కావొచ్చని అంటున్నారు. పూర్తి విశ్లేషణకు ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=gIzXpNzGvpQ