For Money

Business News

NIFYT TODAY: ఓవర్‌ సోల్డ్ జోన్‌లో…

మార్కెట్‌ నిన్ననే ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉందని టెక్నికల్‌ అనలిస్టులు అన్నారు. అయినా నిన్న వీక్లీ క్లోజింగ్‌ కారణంగా అమ్మకాల ఒత్తిడి మరోసారి అధికంగా వచ్చింది. టెక్నికల్‌గా సెల్‌ సిగ్నల్‌ వస్తున్నా.. మార్కెట్‌ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉన్నందున ఇవాళ నిఫ్టి మళ్లీ 16000 స్థాయిని తాకుతుందేమో చూడాలి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లోకి వస్తే .. ఇది సాధ్యమే.మార్కెట్‌లో మిడ్‌ సెషన్‌ ముందు లాభాల స్వీకరణ వచ్చినా.. యూర్ మార్కెట్లు గ్రీన్లో వస్తే … నిఫ్టి 16000 స్థాయిని తాకొచ్చు. నిఫ్టిని దిగువ కొనడం కంటే.. అధిక స్థాయిలో అమ్మమనే సలహా ఇస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఇక టెక్నికల్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయంటే…

అప్‌ బ్రేకౌట్‌ 16061
రెండో ప్రతిఘటన 15989
తొలి ప్రతిఘటన 15942
నిఫ్టికి కీలకం 15904
తొలి మద్దతు 15674
రెండో మద్దతు 15627
డౌన్‌ బ్రేకౌట్‌ 15556