NIFTY: దిగువ స్థాయిలో మద్దతు?
ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి నిన్న 16278 వద్ద ముగిసింది. దాదాపు తొలి మద్దతు లేదా రెండో మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ప్రారంభం కావొచ్చు. టెక్నికల్‌గా నిఫ్టికి ఇవాళ కొనుగోలు సంకేతాలు ఉన్నాయి. మరి ఏ స్థాయిలో మద్దతు లభిస్తుందో చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నందున… మిడ్ సెషన్ చాలా కీలకం కానుంది. కాబట్టి తొందరపడి కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే మిడ్ సెషన్‌లో మద్దతు లభించకుంటే నిఫ్టి 16130 దిగువకు వస్తుందేమో చూడండి. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా ఉన్నాయి.
అప్ బ్రేకౌట్ – 16427
రెండో నిరోధం – 16387
తొలి నిరోధం – 16361
నిఫ్టికి కీలకం – 16205
తొలి మద్దతు – 16196
రెండో మద్దతు – 16170
డౌన్ బ్రేకౌట్ – 16130