NIFTY TODAY: 17400 కీలకం
సింగపూర్ నిఫ్టి నష్టాల్లో ఉంది. సో.. ఏప్రిల్ నెల డెరివేటివ్స్ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానున్నాయి. నిఫ్టి క్రితం ముగింపు 17464. సింగపూర్ నిఫ్టి స్థాయిలో మన మార్కెట్లు క్షీణించే పరిస్థితుల్లో నిఫ్టి 17400 దిగువకు వెళ్ళే అవకాశముంది. నిఫ్టికి ఇవాళ రెండో ప్రధాన మద్దతు స్థాయి 17400.ఈ స్థాయికి దిగువకు వెళితే 17380. ఈ స్థాయి వద్ద మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. చాలా మంది అనలిస్టులు బై ఆన్ డిప్స్ వ్యూహాన్ని ఇప్పటికే సిఫారసు చేస్తున్నారు. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్ ఇలా ఉన్నాయి.
అప్ బ్రేకౌట్ – 17550
రెండో ప్రతిఘటన – 17530
తొలి ప్రతిఘటన – 17516
నిఫ్టి కీలకం – 17487
తొలి మద్దతు – 17413
రెండో మద్దతు – 17400
డౌన్ బ్రేకౌట్ – 17380