16,100 దిగువన కవర్ చేయండి
తమ వద్ద షార్ట్ పొజిషన్స్ ఉన్న ట్రేడర్స్ నిఫ్టి గనుక 16100 దిగువకు వస్తే తమ పొజిషన్స్‌ను కవర్ చేసుకోవాల్సిందిగా డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. అంటే షార్ట్ పొజిషన్స్‌ను అమ్మి లాభాలు స్వీకరించమని సలహా ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా 16000 వద్ద భారీ ఎత్తున పుట్ రైటింగ్ ఉంది. అంటే నిఫ్టికి ఇది పెద్ద సపోర్ట్ జోన్‌గా ఉంది. దీన్ని బ్రేక్ చేయడం ఇవాళ కష్టమని ఆయన అంటున్నారు.నిఫ్టికి ఇవాళ 16161 వద్ద లేదా 16077 వద్ద గట్టి మద్దతు ఉందని ఆయన అంటున్నారు. 16020ని కోల్పోతే 15957కు నిఫ్టి చేరే అవకాశముంది. దిగువ స్థాయి నిఫ్టికి 16020 వద్ద గట్టి మద్దతు ఉంది. ఇక పెరిగితే 16267 వద్ద తొలి ప్రతిఘటన, రెండో ప్రతిఘటన 16324 వద్ద ఎదురు కానుందని పేర్కొన్నారు. 16383 లేదా 16429 ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రధాన కారణం 16500 వద్ద కాల్ రైటింగ్ చాలా అధికంగా ఉంది. అంటే ఈ స్థాయిని నిఫ్టి దాటడం కష్టంగా ఉందన్నమాట. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి…
https://www.youtube.com/watch?v=K8YDYLFotbc
https://www.youtube.com/watch?v=2LWYxqDyUgk