NIFTY TODAY: 17100పైన నిఫ్టి నిలబడేనా?
మార్కెట్ కచ్చితంగా 16500ని తాకుతుందని మెజారిటీ అనలిస్టులు అంటున్నారు. 16700 వద్ద మద్దతు లభించినా… స్వల్ప పుల్ బ్యాక్ తరవాత నిఫ్టి పతనం కావడం ఖాయమని మరికొందరు అంటున్నారు. ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న పుల్ బ్యాక్ ర్యాలీల విషయంలో సెల్ ఆన్ రైజ్ వ్యూహాన్ని పాటించాలని వీరు సూచిస్తున్నారు. నిఫ్టి ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైనా… 17100 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. డే ట్రేడర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టి లెవల్స్. ఇది కేవలం మార్కెట్ కదలికలపై అవగాహన కోసం మాత్రం. ట్రేడింగ్ చేయాలనకునేవారు ఫైనాన్షియల్ అనలిస్ట్ సలహాతోనే చేయగలరు.
నిఫ్టి టుడే లెవల్స్
అప్ బ్రేకౌట్17224
రెండో ప్రతిఘటన 17149
తొలి ప్రతిఘటన 17100
నిఫ్టి కీలకం 17020
తొలి మద్దతు 16818
రెండో మద్దతు 16768
డౌన్ బ్రేకౌట్ 16694