NIFTY TODAY: పెరిగితే అమ్మండి
మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. రేపు డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్న నేపథ్యంలో నిఫ్టి ఈ స్థాయిలో ప్రారంభం కావడమంటే ఔట్ ఆఫ్ కాల్స్ … మొత్తం జీరో అయిపోతాయి. నిన్న ఔట్ ఆఫ్ కాల్స్ కొన్నవారందరికీ భారీ నష్టాలు తప్పడం లేదు. అట్ ద కాల్స్ కొన్నవారు కూడా భారీగా నష్టపోనున్నారు. పుట్స్ కొన్నవారికి భారీ లాభాలు ఖాయంగా కన్పిస్తోంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… నిఫ్టికి సంబంధించిన దాదాపు అన్ని రకాల సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. మధ్యలో ఏమాత్రం పెరిగినా … అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలి. ద్వితీయార్థంలో బ్యాంక్ నిఫ్టికి మద్దతు లభించవచ్చు. నిఫ్టికి ఇవాళ్టికి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17293
రెండో ప్రతిఘటన 17126
తొలి ప్రతిఘటన 17109
నిఫ్టికి కీలకం 17079
తొలి మద్దతు 17034
రెండో మద్దతు 16977
డౌన్ బ్రేకౌట్ 16910