ఓపెనింగ్ ఓకే… నిఫ్టి నిలబడేనా?
మార్కెట్ ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి దగ్గరకు వచ్చింది.16303 వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 16,329ని తాకింది. తొలి ప్రతిఘటన స్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇపుడు 22 పాయింట్ల లాభంతో 16,304 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి క్రితం ముగింపు వద్ద అంటే 16,280 ప్రాంతంలో సపోర్ట్ వస్తుందేమో చూడండి. ఈ స్థాయి మద్దతు అందకపోతే నిఫ్టి 16,220ని తాకే అవకాశముంది. నిఫ్టికి మద్దతు లభించినా 16,350 దాటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అన్ని సూచీలు బలహీనంగా ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
పవర్ గ్రిడ్ 179.85 1.98
ఐటీసీ 212.25 1.73
టాటా మోటార్స్ 298.60 1.07
ఎం అండ్ ఎం 786.45 1.00
యూపీఎల్ 780.00 0.80
నిఫ్టి టాప్ లూజర్స్
ఐషర్ మోటార్స్ 2,695.00 -0.86
కొటక్ బ్యాంక్ 1,767.00 -0.76
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,033.55 -0.73
దివీస్ ల్యాబ్ 4,891.05 -0.57 డాక్టర్ రెడ్డీస్ 4,718.35 -0.56