NIFTY TRADE: 18240 కీలకం
చైనా మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. చైనా పతనం మన మార్కెట్లకు పాజిటివ్‌గా పనిచేసింది. కాని గత ఎనిమిది రోజుల నుంచి దేశీయ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. నిన్న స్వల్పంగా కొనుగోలు చేసినా.. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మారు. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో కొనసాగుతారా? చైనా వైపు మొగ్గుతారా అన్నది చూడాలి. ఇక ఇవాళ్టి డే ట్రేడింగ్ విషయానికొస్తే … నిఫ్టి క్రితం ముగింపు 18,178 నిఫ్టి ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18200ను దాటే అవకాశముంది. నిఫ్టికి ఇది కీలక స్థాయి. ఇక్కడ మద్దతు అందే పక్షంలో నిఫ్టి 18240 దాకా వెళ్ళే అవకాశుముంది. ఈ స్థాయిని దాటితే 18,290 దాకా వెళ్ళొచ్చు. కాని నిఫ్టికి 18,240 దాటితే కాస్సేపు వెయిట్ చేయడం మంచిది. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి 18280-90 ప్రాంతంలో 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చు. నిఫ్టి18330 దాటితే నిఫ్టిలో ర్యాలీ కొనసాగవచ్చు. అయితే నిఫ్టి పటిష్టంగా ముందుకు సాగాలంటే 18400ను దాటాలి. కాబట్టి నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు. 18270-90 మధ్యలో అమ్మొచ్చు. రిస్క్ తీసుకునేవారు అంతకన్నా ముందే అమ్మొచ్చు. నిఫ్టి గనుక 18200 దిగువకు చేరితే మాత్రం భారీ నష్టాలు ఉంటాయి. తొలుత 18,115.. తరవాత 18070 దాకా వెళ్ళొచ్చు. 18,030 ప్రాంతంలో మద్దతుకు ఛాన్స్ ఉంది. 17,975 డౌన్సీడ్లో చాలా కీలక స్థాయి. దీనికి దిగువకు వెళితే మాత్రం భారీ నష్టాలు ఉంటాయి. మరి ఆ పరిస్థితి రాకపోవచ్చు. 18,070 ప్రాంతంలో మద్దతు అందవచ్చని తెలుస్తోంది. లెవల్స్‌ను బట్టి, మీ రిస్క్‌ను బట్టి పొజిషన్ తీసుకోండి.