NIFTY TODAY: 17400 కీలకం
నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టికి 17400 పెద్ద గోడగా మారింది. ఈ స్థాయిని దాటిన ప్రతిసారీ ఒత్తిడి వస్తోంది. ఇవాళ కూడా నిఫ్టికి ఇది ప్రధాన తొలి నిరోధం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు17,302. ఆసియా మార్కెట్లు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా… ఇతర ఆసియా మార్కెట్లను గమనించండి. కొత్త వీక్లీ డెరివేటివ్ సెషన్ గ్రీన్‌లో ప్రారంభమైనా… అవి నిలబడుతాయా అన్నది అనుమానమే. ఉక్రెయిన్ గొడవ నేపథ్యంలో పొజిషన్స్‌ను ఎవరూ క్యారీ చేయరు. ఎందుకంటే మరో రెండు రోజులు మార్కెట్లు పనిచేయవు. ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలో సెషన్ చివర్లో ఒత్తిడి వస్తుందేమో చూడాలి. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్ 17436
రెండో ప్రతిఘటన 17418
తొలి ప్రతిగటన 17379
నిఫ్టికి కీలకం 17328
తొలి మద్దతు 17231
రెండో మద్దతు 17208
డౌన్ బ్రేకౌట్ 17174
టెక్నికల్స్ బై సంకేతాలు ఇస్తున్నా… వారాంతం కావడంతో పొజిషన్స్ క్యారీకి కొనుగోలు చేయొద్దు. డే ట్రేడర్స్ ఇవాళే తమ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం మంచిది.