NIFTY TRADE: నిఫ్టి నిలబడేనా?
విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్ముతున్నారు. క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. నిన్న నిఫ్టి ఏకంగా 131 పాయింట్లు లాభంతో ముగిసింది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు రూ.1915 కోట్ల నికర అమ్మకాలు చేశారు. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్లర్లు రూ.1,863 కోట్లు కొనుగోళ్ళు చేశారు. మరి నిఫ్టి పెరగడానికి కారణం రీటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌కు వస్తే… సింగపూర్ నిఫ్టి క్రితం ముగింపు స్థాయి వద్దే ఉంది. అమెరికా మార్కెట్లు పెరిగినా.. ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిఫ్టిలో ఒకటే మంత్రం. పెరిగినపుడు స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మడం. వ్యూహం ఫెయిలైతే ఆ మాత్రం నష్టంతో బయటపడటం. ప్రస్తుత స్థాయిలో నిఫ్టిని కొనుగోలు చేసే సాహసం చేయొద్దు. ప్రపంచ మార్కెట్లు నిలదొక్కుకునే వరకు వెయిట్ చేయడం మంచిదని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 17,770 ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు పరవాలేదు. క్రితం ముగింపు అంటే 17,822ను దాటి ముందుకు వెళితే కాస్సేపు వెయిట్ చేయండి. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 17,890 దాకా వెళ్ళే అవకాశముంది. 17,850 వద్ద ఒత్తిడి వస్తే షార్ట్ చేయండి. 20 పాయింట్ల స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో చేయండి. పడితే తొలి స్థాయి 17770, రెండో స్థాయి 17,750 ప్రాంతంలో మద్దతు రావొచ్చు. 17700 దిగువకు వస్తే నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతుంది. దిగువస్థాయిలు లాభాలు స్వీకరణకు ఉపయోగించుకోండి.
Warning: మార్కెట్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కోసం ఇన్వెస్టర్లకు మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయాలు, డేటా మీకు అందించే ప్రయత్నం ఇది. పెట్టుబడికి సంబంధిం తుది నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ అనలిస్ట్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.