NIFTY TRADE: 17000 దిగువకు వస్తేనే…
నిఫ్టి 17000 దిగువకు వస్తేనే షార్ట్ చేయాలని… లేదంటే నిఫ్టి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరందర్ కుమార్ అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు కాబట్టి… అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం బెటర్. ఒక్క స్టాక్ ఆప్షన్స్‌లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1245 కోట్ల నికర కొనుగోలుదారులుగా ఉన్నారు.ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 1728 కోట్లు, ఇండెక్స్ ఆప్షన్స్లోరూ. 3721 కోట్లు, క్యాష్ మార్కెట్లో రూ. 5045 కోట్ల నికర అమ్మకాలు చేశారు. దేశీయ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లోరూ. 3350 కోట్ల నికర కొనుగోళ్ళు చేశారు. నిఫ్టికి 17214, 17296 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వస్తుందని వీరేందర్ కుమార్ సూచిస్తున్నారు. ఇక దిగువ స్థాయిలో నిఫ్టి 17044 లేదా 16982 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని అంటున్నారు. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=SYLhuIR5j10