For Money

Business News

NIFTY TODAY: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు

రీటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నా… విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. మూరత్‌ ట్రేడింగ్‌ వ్యాపార పరిమాణం అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్‌లో నిఫ్టి పరిస్థితి ఎలా ఉంటుదనేది కీలకంగా మారింది. నిఫ్టికి ఏమాత్రం మద్దతు అందినా.. పైస్థాయిలో అమ్మే అంశాన్ని పరిశీలించాలని వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. 18000 దాటితే మాత్రం 18066 లేదా 18110 దాకా నిఫ్టి వెళుతుందని చెబుతున్నారు. అయితే ఇది ఇవాళ అది సాథ్యమేనా అన్నది చూడాలి. ఎందుకంటే ఆసియా మార్కెట్లన్నీ డల్‌గా ఉన్నాయి. పబ్లిక్‌ ఆఫర్లు కూడా భారీగా ఉన్నందున సెకండరీ మార్కెట్‌లో పెట్టుబడులు పరిమితంగా ఉండొచ్చు. 17800 వద్ద మద్దతు లభిస్తుందని వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.