For Money

Business News

NIFTY TRADE: లక్ష్మణ రేఖ18,250

నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ప్రతి రోజూ నిఫ్టి గ్యాప్‌ అప్‌తో ప్రారంభం కానుంది. దీనివల్ల పొజిషనల్‌ ట్రేడర్స్‌కు మినహా డే ట్రేడర్స్‌కు లాభం తక్కువ. నిన్న ఉదయం ప్రారంభం… కనిష్ఠ స్థాయిగా మారుతుందని అనలిస్టులు కూడా ఊహించలేదు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అయితే నిఫ్టి ఒక మోస్తరు నష్టాలు వచ్చినపుడు కొనుగోలు చేయడం ఒక పద్ధతి. అదే బై ఆన్‌ డిప్‌. కాని గత కొన్ని సెషన్స్‌లో ఆ ఛాన్స్‌ రావడం లేదు. సో… డే ట్రేడింగ్‌ చేసేవారికి ఒకటే ఆప్షన్‌ మిగిలింది. అధిక స్థాయికి చేరేంత వరకు ఆగడం. స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో అమ్మి… స్వల్ప లాభాలతో బయటపడటం. ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18200 స్థాయిని దాటనుంది. నిఫ్టికి ఇవాళ్టికి ఉన్న లెవల్స్‌ను గమనించండి. నిఫ్టి తొలి ప్రతిఘటన 15,230 వద్ద ఎదురు కానుంది. తరవాతి స్థాయి 18250. ఈ స్థాయిని దాటితే 18290. అయితే ఈ స్థాయిల్లో అమ్ముతారనేది మీ రిస్క్‌ను బట్టి ఉంటుంది. నిఫ్టికి పడితే 18120 దాకా మద్దతు లేదు. ఈ స్థాయిని కోల్పోతే 18090, 18060 ప్రాంతంలో మద్దతు లభించవచ్చు. మద్దతు స్థాయిలు లాభాలు స్వీకరణకే. కొనడానికి కాదు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ కూడా అధిక స్థాయిలో ఇవాళ పాక్షిల లాభాలు స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇవాళ వీక్లీ సెటిల్‌మెంట్‌ క్లోజింగ్‌. ఈవారంలో ఇదే చివరి ట్రేడింగ్‌ రోజు. రేపు మార్కెట్లకు సెలవు. కాబట్టి డే ట్రేడర్స్‌ ఇవాళ్టి పొజిషన్‌ను ఇవాళే క్లోజ్‌ చేయండి.