NIFTY BET: 17,050 కీలకం
విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం తమ అమ్మకాలను ఆపడం లేదు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతుతో నిఫ్టి నెట్టుకువ వస్తోంది. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లో రూ. 827 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో రూ. 1,122 కోట్లు అమ్మారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లో రూ. 1,593 కోట్లు నికర కొనుగోళ్ళు చేయడంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. వీరేందర్ కుమార్ అంచనా మేరకు నిఫ్టికి తొలి ఒత్తిడి 16983 ప్రాంతంలో రానుంది. తరవాత ప్రతిఘటన 17048 ప్రాంతంలో. ఇంకా పెరిగితే 17,102 లేదా 17145 వద్ద వచ్చే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ పడితే నిఫ్టికి 16866 వద్ద లేదా 16813 వద్ద మద్దతు వస్తుందని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు తగ్గుతోందని ఆయన అంటున్నారు. ఇతర ప్రధాన అంశాల కోసం వీడియో చూడగలరు.