NIFTY TODAY: పెరిగితే అమ్మండి
చాలా రోజుల తరవాత ఆసియా మార్కెట్లకు భిన్నంగా చైనా మార్కెట్లు భిన్నంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్ నష్టాల్లో ఉండటంతో మన నిఫ్టి పరిస్థితిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిఫ్టి గురువారం ముగింపు 17,764. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇపుడు సింగపూర్ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా… అడ్జస్ట్ చేస్తే నష్టాల్లో ఓపెన్ కావొచ్చని తెలుస్తోంది. మొత్తానికి నిఫ్టికి 17,677 కీలక స్థాయి. దీనిపైన నిఫ్టి నిలబడితే 17800కు, తరవాత 17850 దాకా వెళ్ళొచ్చు. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఇక నిఫ్టికి మద్దతు స్థాయిల గురించి చూస్తే 17,670 వద్ద తొలి మద్దతు లభించనుంది. ఈ స్థాయి దిగువకు వెళితే 17650, 1760 ప్రాంతాలను చూడొచ్చు. నిఫ్టి పెరిగితే అమ్మడమే బెటర్ అని అనలిస్టలు హెచ్చరిస్తున్నారు.