NIFTY TRADE: పెరిగితే అమ్మండి
సింగపూర్ నిఫ్టి మాదిరిగా నిఫ్టి గనుక 17,950 ప్రాంతంలో ఓపెనైతే వెంటనే కళ్ళు మూసుకుని నిఫ్టిని అమ్మేయొచ్చు. ఆమాటకొస్తే నిఫ్టి 17920 ప్రాంతంలో ప్రారంభమైనా ఆల్గో స్ట్రాటజీ ప్రకారం 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. నిఫ్టి గనుక 17950పైన స్థిరంగా గంటకు పైగా నిలబడితే 18,000ని టచ్ కావొచ్చు. నిఫ్టికి 17870 కీలక స్థాయి. ఈ స్థాయికి దిగువకు చేరితే నిఫ్టి 17,800 ప్రాంతానికి చేరింది. నిఫ్టి అధిక స్థాయిలో ఉన్నందున పూర్తిగా టెక్నికల్ ట్రేడ్‌కు పరిమితం కావడం బెటర్. నిఫ్టి భారీ ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. పైగా గురువారం ఈనెల, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. ఏ పరిస్థితుల్లోనూ నిఫ్టి కొనుగోలు చేయొద్దు. ఇప్పటికే పొజిషన్స్ కొనసాగితున్నవారు తమ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చు. అయితే స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనసాగించండి.