NIFTY TRADE: అధికస్థాయిలో అమ్మండి..కాని
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో ఉన్న జోష్ ఆసియా మార్కెట్లలో కన్పించడం లేదు. డాలర్ బలహీనపడటంతో క్రూడ్ మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఇక నిఫ్టి విషయానికొస్తే… నిఫ్టి క్రితం ముగింపు 16,705. సింగపూర్ నిఫ్టి 90 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో నిఫ్టి ప్రారంభమౌతుందా అనేది చూడాలి. నిజంగా నిఫ్టి 16,800పైన ప్రారంభమైతే…నిలబడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థాయికి చేరితే నిఫ్టి బుల్రన్లోకి వచ్చినట్లే. ఈ స్థాయిలో లాభాల స్వీకరణ జరిగితే నిఫ్టి 16,780 లేదా 16,760 ప్రాంతానికి వస్తుందేమో చూడండి. 16,800పైన నిఫ్టి బలహీనంగా ఉంటే నిఫ్టి 16,665 ప్రాంతంలో మద్దతు లభించాలి. మరికాస్త తగ్గితే నిఫ్టి మద్దతు స్థాయికి వచ్చినట్లే. 16,640-16,650 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు రావొచ్చు. ఉదయం అధిక స్థాయిలో అమ్మినవారు స్వల్ప లాభాలతో బయటపడి… దిగువ స్థాయిలో మద్దతు లభిస్తుందేమో చూడండి. నిఫ్టి భారీగా క్షీణించడానికి కారణాలు లేవు. కాబట్టి పొజిషనల్ సెల్లింగ్‌కు అంటే దీర్ఘకాలిక అమ్మకాలకు దూరంగా ఉండండి. 16,800పైన కొనుగోలు చేయొద్దు. ఆసియా లాభాలు పరిమితంగా ఉండటం, యూరో కూడా ఉత్సాహం నామ మాత్రంగా ఉంటే నిఫ్టి అధిక స్థాయిలో నిలబడటం కష్టమే.