For Money

Business News

NIFTY LEVELS: పెరిగే ఛాన్స్‌…!

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17530. ఈ స్థాయి నుంచి నిఫ్టి ఏ కాస్త పడినా.. కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించండి. 17465-17490 మధ్య కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించండి. నిఫ్టికి ప్రధాన మద్దతు 17409 వద్ద లభించనుంది. రిస్క్‌ వొద్దనుకునేవారు ఈ స్థాయి వరకు వెయిట్‌ చేయడం మంచిది. ఎందుకంటే ఇవాళ ప్రథమార్థంలో మద్దతు లభించే అవకాశముంది. రెండో సెషన్‌లో ముఖ్యంగా యూరో మార్కెట్లు ప్రారంభ సమయంలో లాభాలు తీసుకోవడం మంచిదని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టికి మద్దతు లభిస్తే 17700ని దాటే అవకాశముంది. రెండో సెషన్‌లో కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉండకపోవచ్చని… వచ్చినా దూరంగా ఉండటం మంచిదని అనలిస్టులు అంటున్నారు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ – 17757
రెండో నిరోధం – 17694
తొలి నిరోధం – 17653
నిఫ్టికి కీలకం – 17636
తొలి మద్దతు – 17409
రెండో మద్దతు – 17368
డౌన్‌ బ్రేకౌట్‌ – 17305