NIFTY TRADE: అమ్మే ఛాన్స్ ఉంది
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. బహుశా 16250 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. ఇక్కడ కాకుండా కాస్త పెరిగిన తరవాత నిఫ్టి పుట్స్ కొనుగోలు చేయమని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టిని అమ్మే సమయంలో 16500 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని.. ఇది పొజిషనల్ ట్రేడర్స్ కోసమని అన్నారు. ఇక డే ట్రేడర్స్ నిఫ్టిని షార్ట్ చేస్తే శుక్రవారం నాటి ముగింపు 16411ని స్టాప్‌లాస్‌తో చేసుకుని పుట్స్ కొనాలని ఆయన అన్నారు. నిఫ్టికి 16500 చాలా గట్టి ప్రతిఘటన ఉందని, ఇక్కడ లక్షకు పైగా కాల్ రైటర్స్ ఉన్నారని ఆయన అంటున్నారు. అయితే దిగువ స్థాయిలో ఎక్కడా మద్దతు లేదని.. కాబట్టి కాల్ రైటింగ్‌ను బట్టి పుట్స్ పొజిషన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు. నిఫ్టికి 16221, 16146 స్థాయిల మద్దతు అందాలని.. లేకుంటే 16080 లేదా 16012కు పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందరు అనలిస్టుల మాదిరిగానే నిఫ్టి పెరిగే ఛాన్స్ ఇప్పట్లో లేదని వీరేందర్ కుమార్ కూడా స్పష్టం చేశారు. ఇతర వివరాలు, బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం దిగువ వీడియోలు చూడండి.
https://www.youtube.com/watch?v=UCZe6nvU8eU
https://www.youtube.com/watch?v=b7PoFXFfLK4