NIFTY LEVELS: పెరిగితే అమ్మండి
డే ట్రేడర్స్‌కు ఇపుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. నిఫ్టి భారీ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అంటే డే ట్రేడర్స్ మంచి అవకాశాలు వస్తున్నాయన్నమాట. మార్కెట్లో బలహీనంగా ఉన్నా నిఫ్టికి ఇవాళ కాస్త మద్దతు లభించే అవకాశముంది. కాని ఇది నిలబడే ఛాన్స్ తక్కువగా ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 16,983 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 17000ని దాటే అవకాశముంది. అయితే 17086 లేదా 17120 వద్ద నిఫ్టికి ప్రతిఘటన రావొచ్చు. ఈ రెండు స్థాయిలను దాటే పక్షంలో 17171 నిఫ్టి బ్రేకౌట్‌కు ఛాన్స్. ఇవాళ బ్రేకౌట్‌కు ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి. నిఫ్టి గనుక పడితే 16881 దాకా మద్దతు లేదు. తరువాతి స్థాయి 16848. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. గత మూడు సెషన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.9000 కోట్లు అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు 85 షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టి పుట్ రైటింగ్ పెద్దగా లేదు. అంటే నిఫ్టి ఎక్కడ దాకా పడుతుందనే అంశంలో క్లారిటీ లేదు. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ మార్కెట్ మరింత పడే వరకు ఆగడం మంచిది.