నిఫ్టి నిలదొక్కుకునేనా?
అమెరికా సూపర్, ఆసియా డల్. ఈ నేపథ్యంలో స్థిరంగా లేదా కాస్త బలహీనంగా నిఫ్టి ప్రారంభం కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగలేదు. నిఫ్టి క్రితం ముగింపు 16,770. ఇవాళ నిఫ్టి దాదాపు ఇదే స్థాయిలో లేదా 16800 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి ఒకవేళ ఇక్కడి నుంచి పెరిగే పక్షంలో తొలి ప్రతిఘటన 16859 ప్రాంతంలో ఎదురు కానుంది. తరవాతి స్థాయి 16877-16900. ఇవి లెవల్స్ మాత్రమే. ట్రెండ్‌ను గమనించండి. నిఫ్టి గనుక పడితే 16,665 వద్ద మద్దతు ఉంది. అంటే వంద పాయింట్ల క్షీణత. మరి ఈ స్థాయికి వస్తుందా అన్నది చూడాలి. ఈ స్థాయి తరువాతి మద్దతు స్థాయి 16,630. ఈ లెవల్స్‌ను చూసి ట్రేడ్ చేయండి. నిఫ్టి ఎంత పెరిగినా… పై స్థాయిలో ఒత్తిడి వస్తోంది. అధిక స్థాయిలో మాత్రం కొనుగోళ్ళు చేయొద్దు.