NIFTY TRADE: పెరిగితే అమ్మండి
మార్కెట్ ఇవాళ కూడా స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,888. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17900 -17930 ప్రాంతంలో ఓపెన్ కావొచ్చు. అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా.. ఆసియా మార్కెట్లలో వస్తున్న ఒత్తిడి చూస్తుంటే.. అధిక స్థాయిలో నిఫ్టికి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టి గనుక గ్రీన్‌లో ప్రారంభమైతే… కాస్సేపు వెయిట్ చేయండి. నిఫ్టి 17950ని దాటి 17970 దాకా వెళుతుందేమో చూడండి. వెళితే 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మండి. 18000 దాటితే అమ్మొద్దు. నిఫ్టికి ఇవాళ 17,915 వద్ద మద్దతు ఉంది. ఈ స్థాయికి దిగువకు వెళితే క్రితం స్థాయి వద్ద మద్దతు అందుతుందేమో చూడండి. అంటే 17888 వద్ద నిలబడుతుందే చూడండి. కాని ఇవాళ నిఫ్టి 17,820 ప్రాంతానికి చేరే అవకాశం అధికంగా ఉంది. మార్కెట్లకు రేపు, ఎల్లుండి సెలవు. రేపు దీపావళి సందర్భంగా సాయంత్రం ప్రత్యేక ట్రేడింగ్ మాత్రం ఉంటుంది. కాబట్టి లాభాల స్వీకరణకు ఛాన్స్ ఉంది.