For Money

Business News

NIFTY TODAY: 17400 దాటితే జాగ్రత్త

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. విచిత్రంగా అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ అనూహ్యంగా పెరుగుతున్నా… ఈక్విటీ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు క్రూడ్‌ ధరలు పెరుగుతున్నా మార్కెట్‌లో స్పందన కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో నిఫ్టి నిన్న 200 రోజుల చలన సగటును అధిగమించి… ముందుకు సాగింది. డాలర్ ఇటీవల బాగా బలపడినందున ఫార్మా, ఐటీ రంగ కంపెనీల ఫలితాలు బాగుండొచ్చు. మిగిలిన కంపెనీలు ముఖ్యంగా క్రూడ్‌ ఆధార కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డే ట్రేడర్స్‌ టెక్నికల్‌ లెవల్స్‌ గమనించడం మర్చిపోవద్దు. నిఫ్టి ఇవాళ లాభాలతో ఓపెన్‌ కానుంది. తొలి ప్రతిఘటన 17400పైన ఎదురు కానుంది. ఇవాళ్టి లెవల్స్‌ చూడండి.

అప్‌ బ్రేకౌట్‌ 17515
రెండో ప్రతిఘటన 17498
తొలి ప్రతిఘటన 17424
నిఫ్టికి కీలకం 17219
తొలి మద్దతు 17200
రెండో మద్దతు 17170
డౌన్‌ బ్రేకౌట్‌ 17116

నిఫ్టి క్రమంగా ఓవర్‌బాట్‌ స్థితికి వస్తోంది. పడితే కొనమని సిగ్నల్స్‌ చెబుతున్నాయి. రేపు మన మార్కెట్‌లో వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది.