For Money

Business News

NIFTY TRADE: 17500 కీలకం

మరికాస్సేపట్లో ఆర్బీఐ పరపతి విధానం వెల్లడి కానుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిక స్థాయిల వద్ద నిఫ్టి నిలబడుతుందా అన్నది చూడాలి. కార్పొరేట్‌ ఫలితాలు చాలా వరకు బాగా లేవు. మరో ట్రిగ్గర్‌ లేని నేపథ్యంలో నిఫ్టికి 17500 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదురు కానుంది. నిఫ్టికి దిగువన సమీపంలో మద్దతు లేదు. అంటే పడితే భారీ నష్టాలు ఉంటాయని తెలుస్తోంది. నిఫ్టి లెవల్స్‌ ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం

అప్‌ బ్రేకౌట్‌ – 17580
రెండో ప్రతిఘటన – 17533
తొలి ప్రతిఘటన – 17522
నిఫ్టికి కీలకం – 17412
తొలి మద్దతు – 17357
రెండో మద్దతు – 17206
డౌన్‌ బ్రేకౌట్‌ – 17177

చిన్న ఇన్వెస్టర్లు ఇవాళ ఆప్షన్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. రెండు ఈవెంట్లు ఒకేరోజు ఉండటంతో నిఫ్టిలో హెచ్చతగ్గులు అధికంగా ఉండే అవకాశాలున్నాయి. భారీగా పడితే నిఫ్టికి 17177 ప్రాంతంలో మద్దతు అందాలి.