NIFTY TODAY: 17,280 కీలకం
అమెరికా మార్కెట్లు గత శుక్రవారం ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇతర సూచీలు కూడా బాగా లాభపడ్డాయి. కాని ఆ స్థాయి లాభాలు ఆసియా మార్కెట్‌లో కన్పించడం లేదు. అత్యధికంగా జపాన్ ఒక శాతం లాభపడింది. అమెరికా టెక్ షేర్లకు మద్దతు లభించినందున… మన మార్కెట్‌లో కూడా ఐటీ షేర్లకు మద్దుత లభిస్తుందేమో చూడాలి. రేపు బడ్జెట్ ఉంది. కాని మార్కెట్‌లో ఈ బడ్జెట్‌పై పెద్దగా ఉత్సాహం లేదు. సో… లెవల్స్‌ను బట్టి నిఫ్టిలో ట్రేడ్ చేయడం మంచిది. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నాయి. గత శుక్రవారం నష్టాల్లో ముగిసిన యూరో మార్కెట్లు ఎలా ఉంటాయో చూడండి. నిఫ్టి క్రితం ముగింపు 17101. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్ 17281
రెండో ప్రతిఘటన 17230
తొలి ప్రతిఘటన 17200
నిఫ్టికి కీలకం 17185
నిఫ్టికి తొలి మద్దతు 17000
రెండో మద్దతు 16970
డౌన్ బ్రేకౌట్ 16923
టెక్నికల్‌గా సూచీలు సెల్ సిగ్నల్ చూపిస్తున్నా… నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది. కాబట్టి నిఫ్టి బాగా పెరిగే వరకు ఆగండి. ఇవాళ్టి మిడ్ సెషన్ చాలా కీలకం. అలాగే ఇవాళ ఆ సమయానికి ఆర్థిక సర్వే రావొచ్చు.